శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 15 జనవరి 2017 (09:43 IST)

గంగానదిలో పడవ బోల్తా.. 21 మంది మృతి.. ఓవర్ లోడ్‌తోనే ప్రమాదం..?

బీహార్ రాజధాని పాట్నాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గంగానదిలో 40 మంది ప్రయాణీకులతో వెళ్తున్న పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో 21మంది ప్రాణాలు కోల్పోయారు. కైట్ ఫెస్టివల్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చో

బీహార్ రాజధాని పాట్నాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గంగానదిలో 40 మంది ప్రయాణీకులతో వెళ్తున్న పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో 21మంది ప్రాణాలు కోల్పోయారు. కైట్ ఫెస్టివల్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రెవెన్యూ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. 
 
పడవలో పరిమితికి మంచి ప్రయాణికులు ఎక్కడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. బిహార్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పండుగ పూట జరిగిన ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.