శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 10 జులై 2017 (09:15 IST)

శోభనం రోజున కడుపు నొప్పిగా ఉందని.. టాయ్‌లెట్ వెళ్లి వస్తానని జంప్..

నర్సును పెళ్లి చేసుకున్నాడు. శనివారం శోభనం జరగాల్సింది. అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ వరుడు పరారైనాడు.. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరునెల్వేలి

నర్సును పెళ్లి చేసుకున్నాడు. శనివారం శోభనం జరగాల్సింది. అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ వరుడు పరారైనాడు.. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరునెల్వేలి జిల్లా వీకే పురానికి చెందిన ఆంటోనీ జోసెఫ్ (29)కు తాట్టంపట్టికి చెందిన ఓ నర్సుతో వివాహమైంది. శనివారం రాత్రి వీరిద్దరికీ పెద్దలు శోభనం ఏర్పాటు చేశారు. 
 
వరుడు గదిలో వేచి ఉన్నాడు.. అనుకున్న ముహుర్తం ప్రకారం వధువు కూడా గదిలో అడుగు పెట్టింది. అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ.. వధువు రాగానే.. జోసెఫ్ కడుపునొప్పిగా ఉందని, టాయిలెట్‌కు వెళ్లివస్తానని చెప్పి వెళ్లాడు. కానీ ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో వధువు ఈ విషయాన్ని పెద్దలకు తెలిపింది. ఇంతలో తెల్లారిపోయింది. ఇక లాభం లేదనుకున్న జోసెఫ్ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.