శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 29 డిశెంబరు 2016 (17:14 IST)

ఆటోలో అమ్మాయిలు... రోడ్డు మీద డ్రైవరుతో బేరం... డీల్ రూ.500

వ్యభిచారం దేశంలో పలుచోట్ల విచ్చలవిడిగా జరుగుతోందనడానికి ఇటీవల చాలా ఘటనలు వెలుగుచూస్తున్నాయి. గుజరాత్ ఖోఖ్రా బ్రిడ్జికి సమీపంలో కొంతమంది యువకులు తమతమ ద్విచక్ర వాహనాలను రోడ్డు ప్రక్కనే పార్క్ చేసి ఏదో పని ఉన్నట్లుగా అటూఇటూ తిరుగుతూ కన్పిస్తుంటారు. ఇంతల

వ్యభిచారం దేశంలో పలుచోట్ల విచ్చలవిడిగా జరుగుతోందనడానికి ఇటీవల చాలా ఘటనలు వెలుగుచూస్తున్నాయి. గుజరాత్ ఖోఖ్రా బ్రిడ్జికి సమీపంలో కొంతమంది యువకులు తమతమ ద్విచక్ర వాహనాలను రోడ్డు ప్రక్కనే పార్క్ చేసి ఏదో పని ఉన్నట్లుగా అటూఇటూ తిరుగుతూ కన్పిస్తుంటారు. ఇంతలో అటుగా ఓ ఆటో వస్తుంది. డ్రైవరు ఈ యువకులు నిలబడిన ప్రాంతానికి కొద్దిగా దూరంగా ఆపేస్తాడు. ఆటో లోపలి నుంచి అలా తల బయటకు పెట్టి చూస్తాడు. 
 
పార్క్ చేసి నిరీక్షిస్తున్న యువకుల్లో కొందరు ఉత్సాహంగా ఆటో వైపు వెళ్తారు. వారు ఆటో డ్రైవరును అడ్రెస్ అడుగుతున్నారేమోనని చూసినవారు అనుకుంటారు కానీ నిజం అది కాదు. ఆటోలో అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని చూసి అతడు రేటు చెప్తాడు. వెళ్లిన కుర్రాడు మరో రేటు చెప్తాడు. రూ. 500 నుంచి వ్యవహారం నడుస్తుంది. చిట్టచివరికి డీల్ కుదరగానే పార్కు చేసి ఉన్న మోటారు బైకుతో సదరు యువకుడు ఆటోను ఫాలో అవుతాడు. ఆ ఆటో తిన్నగా వ్యభిచార గృహాల వైపు వెళ్లిపోతుంది. ఈ ఘటనలు అక్కడ జరుగుతున్నాయని పోలీసుల దృష్టికి రావడంతో వారు రంగంలోకి దిగారు.