మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 నవంబరు 2016 (16:13 IST)

పెద్ద నోట్ల రద్దు: రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం.. గృహ రుణాలపై 6-7 శాతం వడ్డీ.. కొత్త పథకానికి మోడీ ప్లాన్..?

పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరుల భరతం పట్టిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సామాన్య ప్రజలకు మేలు చేసేలా.. గృహ నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ పథకంపై ఇప్పటికే రిజర్వ్ బ్యా

పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరుల భరతం పట్టిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సామాన్య ప్రజలకు మేలు చేసేలా.. గృహ నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ పథకంపై ఇప్పటికే రిజర్వ్ బ్యాంకు అధికారులతో చర్చించినట్టు తెలిసింది. 2017 కేంద్ర బడ్జెట్‌ను ఈసారి ఫిబ్రవరి 1 నాడే ప్రవేశపెట్టే అవకాశాలుండడంతో అంతకంటే ముందుగానే నూతన హౌసింగ్ పథకాన్ని ప్రకటించనున్నట్టు కనిపిస్తోంది. 
 
రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో గత కొద్ది రోజులుగా కొనుగోళ్లు పడిపోయి రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. కాగా బ్యాంకులు కూడా ప్రజలను గృహ రుణాల వైపు ఆకర్షించేందుకు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
నోట్లరద్దుతో వసూలవుతున్న ఆదాయంపై పూర్తి స్పష్టత వచ్చిన తరువాతే గృహ పథకంపై తుదినిర్ణయానికి రానున్నట్టు సమాచారం. ఈ పథకంలో భాగంగా రూ.50 లక్షల వరకు ఇచ్చే గృహ రుణాలపై 6-7 శాతం వడ్డీ ఉండేలా ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం వస్తోంది. 
 
తొలిసారి రుణం తీసుకునే వారికి అందుబాటులోనే వడ్డీరేట్లు ఉండటంతో.. ఈ పథకం హౌసింగ్ మార్కెట్‌కు మరింత ఊతమివ్వగలదని, రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ కోలుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.