మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 7 జూన్ 2017 (12:13 IST)

మేఘాలయాలో బీఫ్‌పై నిషేధమే లేదంటున్న బీజేపీ.. కానీ యూపీలో గూండాచట్టం కింద?

మేఘాలయాలో బీఫ్‌పై అసలు నిషేధమే లేదంటున్న బీజేపీ యూపీలో మాత్రం సీన్ మార్చేసింది. యూపీలో గోవధకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటోంది. గోవధ, పాలిచ్చే పశువుల అక్రమ రవాణాకు పాల్పడేవారిపై వారిపై జాతీయ భద్రతా చ

మేఘాలయాలో బీఫ్‌పై అసలు నిషేధమే లేదంటున్న బీజేపీ యూపీలో మాత్రం సీన్ మార్చేసింది. యూపీలో గోవధకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటోంది. గోవధ, పాలిచ్చే పశువుల అక్రమ రవాణాకు పాల్పడేవారిపై వారిపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ), గూండా చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. యోగి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గోవధపై హుకుం జారీ చేసిన సంగతి తెలిసిందే
 
ఈ నేపథ్యంలో తాజాగా గోవధకు పాల్పడే వారికి వ్యతిరేకంగా ఎన్‌ఎస్‌ఏ, గూండా చట్టం ప్రయోగిస్తామని డీజీపీ స్పష్టం చేశారు. ఎన్‌ఎస్‌ఏ కింద ఒక వ్యక్తిని అరెస్టు చేస్తే, ఎన్ని రోజులైనా పోలీసులు తమ నిర్బంధంలో ఉంచుకోవచ్చునని తెలిపారు. 
 
అలాగే వారి వివరాలను బహిర్గతం చేయాల్సిన పనిలేదన్నారు. గూండా చట్టం కింద ఒక వ్యక్తి పేరును పోలీసులు నమోదుచేస్తే, అతడిని స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు విచారణ పేరుతో ఎప్పుడైనా పిలవొచ్చుననే విషయాన్ని గుర్తు చేశారు. ఇంకా 14 రోజుల పాటు రిమాండ్ తప్పదన్నారు.