శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 మార్చి 2017 (18:46 IST)

జైలులోనే శశికళకు సీఎం కలలు.. పన్నీర్‌దే ముఖ్యమంత్రి పదవి: పాండ్యరాజన్

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు ఈసీ షాక్ ఇచ్చిన నేపథ్యంలో మూడు గ్రూపులుగా చీలిన అన్నాడీఎంకేలో త్వరలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని పన్నీర్ వర్గంలోని తమిళనాడు మాజీ మంత్రి, పన్నీర్ సెల్వం వర్గంలోన

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు ఈసీ షాక్ ఇచ్చిన నేపథ్యంలో మూడు గ్రూపులుగా చీలిన అన్నాడీఎంకేలో త్వరలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని పన్నీర్ వర్గంలోని తమిళనాడు మాజీ మంత్రి, పన్నీర్ సెల్వం వర్గంలోని సీనియర్ ఎమ్మెల్యే పాండ్యరాజన్ అన్నారు.

అంతేగాకుండా.. త్వరలోనే తమిళనాడు సర్కారు కుప్పకూలుతుందని.. ప్రస్తుతం శశికళ గ్రూపులో ఉన్న ఎమ్మెల్యేలందరూ బయటకు వచ్చి తమ వర్గానికి మద్దతిస్తారని చెప్పారు. అమ్మ ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ పన్నీర్ సెల్వం తమిళనాడు సీఎం అవుతారని జోస్యం చెప్పారు. శశికళ ఇక జైలులో తాను తమిళనాడు సీఎం అవుతానని ఊహించుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. 
 
శనివారం ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ అన్నాడీఎంకే కార్యదర్శిగా శశికళ ఎంపిక ఆ పార్టీకి విరుద్ధంగా జరిగిందని, పార్టీలోని ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు ఆమె నాయకత్వాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారని పాండ్యన్ గుర్తు చేశారు. చిన్నమ్మకు మద్దతిచ్చిన ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. అలాగే శశికళ ఎంపికను ఎన్నికల కమిషన్ రద్దు చేసిన వెంటనే ఆయన స్థానంలో పన్నీర్ సెల్వం సూచించిన సీనియర్ నేతను ఎన్నుకుంటామని పరోక్షంగా అన్నాడీఎంకే పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ పేరు చెప్పారు.