శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 30 సెప్టెంబరు 2020 (08:59 IST)

'చందమామ' శంకర్ మృతి

భారతదేశంలో విశేషంగా పాఠకాదరణ పొందిన బాలల మాస పత్రిక 'చందమామ'లో దశాబ్దాల పాటు వేలాది చిత్రాలను గీసిన శంకర్ మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు.

97 సంవత్సరాల శంకర్ వయోభారంతో ఎదురైన అనారోగ్యం కారణంగా చెన్నయ్ సమీపంలోని పోరూర్‌లోని స్వగృహంలో మృతిచెందారు. 1924 జులై 19న జన్మించిన శంకర్ లైన్ డ్రాయింగ్ అప్పట్లో ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది.

భేతాళ కథలు శీర్షిక కోసం ఆయన వేసిన విక్రమార్కుడు, బేతాళుడు రేఖాచిత్రం పాఠకుల మదిలో నిలిచిపోయింది. 'చందమామ' పత్రికను డిజైన్ చేసిన చిత్రకారులలో ఇంతవరకూ సజీవంగా ఉన్నది శంకర్ ఒక్కరే. ఇప్పుడు ఆయన మరణంతో ఆ శకం ముగిసింది.