సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (12:47 IST)

సుష్మా స్వరాజ్‌కు కేంద్రం అరుదైన గౌరవం

దివంగత నేత సుష్మా స్వరాజ్‌కు కేంద్రం అరుదైన గౌరవాన్ని కల్పించింది. విదేశాంగ మంత్రిగా దేశానికి ఆమె చేసిన సేవలకి గాను.. ఢిల్లీలో ఉన్న ‘ప్రవాసీ భారతీయ కేంద్ర’ భవనానికు సుష్మా స్వరాజ్ పేరు పెట్టాలని నిర్ణయించింది. 
 
"ప్రవాసీ భారత కేంద్ర"కు సుష్మా స్వరాజ్ భవన్‌‌గా మార్చడంతోపాటు ఫారిన్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్‌ను సుష్మా స్వరాజ్ ఫారిన్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్‌గా మార్చాలని కేంద్రం నిర్ణయించినట్టుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
 
కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. ఫిబ్రవరి 14న సుష్మా స్వరాజ్ జయంతి సందర్భంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.