ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2016 (13:03 IST)

స్పెషల్ ప్యాకేజీ.. చంద్రబాబుకు మోడీ ఫోన్.. ఏం మాట్లాడుకున్నారంటే?

స్పెషల్ స్టేటస్‌పై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ ప్రజలు మండిపడుతున్న నేపథ్యంలో కేంద్రం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించడంపై సీఎం చంద్రబాబు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఫోనులో ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర

స్పెషల్ స్టేటస్‌పై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ ప్రజలు మండిపడుతున్న నేపథ్యంలో కేంద్రం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించడంపై సీఎం చంద్రబాబు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఫోనులో ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత నష్టాల్లో కూరుకుపోయిన ఏపీని ఆదుకోవడానికి ప్యాకేజీ ఇవ్వడంపై చంద్రబాబు ప్రధానికి థ్యాంక్స్ చెప్పారు. అలాగే విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కేంద్రం ఉదారతను నిరూపించుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. 
 
ఇందుకు మోడీ కూడా సానుకూలంగా స్పందించారు. తనకు ఏపీ సమస్యలు తెలుసునని, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందేవరకు తమ అండ ఉంటుందని మోడీ భరోసా ఇచ్చారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేసే దిశగా ఏపీ సర్కారు తగిన చర్యలను ప్రధానికి బాబు వివరించారు.  
 
త్వరలో ఢిల్లీకి వచ్చి స్వయంగా కలుస్తానని ప్రధాన మంత్రి మోడీకి చంద్రబాబు తెలియజేశారు. వచ్చేవారం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసే అవకాశం ఉంటుందని టీడీపీ వర్గాల సమాచారం. ఏపీ అభివృద్ధి చెందేవరకు కేంద్రం అండ కావాలని, ఇతర సాయంపైనా ప్రణాళిక రూపొందించుకున్నట్లు ఏపీ సీఎం వెల్లడించారు.