శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (15:42 IST)

చెన్నై ఓలా కారులో 'సెక్స్' డ్రైవర్... కారులో మహిళా వైద్యురాలు...

కామాంధులు అవకాశం కోసం ఎదురుచూసి కాటేస్తారనేది తెలిసిన విషయమే. ఐతే ఇలాంటి కామాంధులకు చిక్కకుండా తృటిలో తప్పించుకున్నది చైన్నైలో ఓ మహిళా వైద్యురాలు. వివరాల్లోకి వెళితే... దక్షిణ చెన్నై ఇంజంబాక్కంకు చెందిన మహిళా వైద్యురాలు విధుల్లో భాగంగా ఆదివారం నైట్ ష

కామాంధులు అవకాశం కోసం ఎదురుచూసి కాటేస్తారనేది తెలిసిన విషయమే. ఐతే ఇలాంటి కామాంధులకు చిక్కకుండా తృటిలో తప్పించుకున్నది చైన్నైలో ఓ మహిళా వైద్యురాలు. వివరాల్లోకి వెళితే... దక్షిణ చెన్నై ఇంజంబాక్కంకు చెందిన మహిళా వైద్యురాలు విధుల్లో భాగంగా ఆదివారం నైట్ షిప్టుకు వెళ్లాల్సి ఉంది. ఓలా క్యాబును బుక్ చేసుకున్న ఆమె అక్కడి నుంచి అంబత్తూరు నార్త్‌కు బయలుదేరింది. ఓలా క్యాబ్ ఇసిఆర్ రోడ్డులో ప్రయాణిస్తుంది. 
 
ఆదివారం కావడంతో రద్దీ అంతగా లేదు. డ్రైవరు విజిపి పీస్ టెంపుల్ దగ్గరకు రాగానే కారును అకస్మాత్తుగా ఆపేశాడు. కారు ఎందుకు ఆపావు అని ఆమె అడిగేలోపే ఇద్దరు వ్యక్తులు కారు డోర్లు తీసుకుని తోసుకుంటూ లోపలకి ఎక్కేశారు. ఆ ఇద్దరు వైద్యురాలికి చెరోపక్క కూర్చుకున్నారు. కారులో ఎక్కినవారు ఎవరని ఆమె ప్రశ్నిస్తే... వారిద్దరూ తన స్నేహితులనీ, దారిలో దిగిపోతారని బదులిచ్చాడు డ్రైవర్. 
 
వైద్యురాలి మనసులో ఏదో కీడు శంకించడంతో తన స్నేహితులకు ఫోన్ సందేశాన్ని పంపి, కారును ఆపాలని డ్రైవరును అడిగింది. ఐతే డ్రైవర్ మాత్రం కారును ఆపేందుకు నిరాకరించాడు. ఆ తర్వాత ఆమె ప్రక్కనే కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. కారును ఆపాలని ఆమె అరుస్తుండటంతో డ్రైవరు కారును మరింత స్పీడుగా నడపడం మొదలుపెట్టాడు. 
 
కారులో మహిళ అరుపులు విన్న ఓ ద్విచక్రవాహనదారుడు కారును వెంబడించి, మోటారు బైకును కారుకు అడ్డంగా నిలిపేశాడు. కారు ఆగడంతో జనం గుమిగూడారు. కారులో ఉన్న ఆగంతకులు ఇద్దరూ కారు దిగి పారిపోయారు. డ్రైవరును పట్టుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకుని పారిపోయినవారి గురించి ప్రశ్నించారు. వారి వివరాలను తీసుకుని వారిని కూడా అరెస్టు చేశారు. కాగా ఈసీఆర్ రోడ్డులో ఒకే ఒక్క చెక్ పోస్ట్ ఉందనీ, ఇక్కడ ఏం జరిగినా పట్టించుకునే నాధుడే లేడంటూ స్థానికులు పోలీసులకు తెలిపారు.