శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 18 జనవరి 2017 (12:50 IST)

ప్రేమ ఒకరితో -పెళ్లి వేరొకరితో.. పెళ్లైనా ప్రియుని అఫైర్: భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి హత్య..

ప్రేమించిన ప్రియుడిని వివాహం చేసుకోలేకపోయింది. వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వేరే వ్యక్తితో వివాహమైనప్పటికీ ప్రియుడిని మాత్రం మర్చిపోలేదు. ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. తమ బంధానికి భర్

ప్రేమించిన ప్రియుడిని వివాహం చేసుకోలేకపోయింది. వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వేరే వ్యక్తితో వివాహమైనప్పటికీ ప్రియుడిని మాత్రం మర్చిపోలేదు. ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది. 
 
వివరాల్లోకి వెళితే చెన్నైలోని వ్యాసార్పాడి కన్నదాసన్ నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ ప్రవీణ్.. ఆరు మాసాల క్రితం తాను నివాసం ఉండే ప్రాంతానికి చెందిన తఫానా అనే మహిళను ప్రేమించి వివాహం చేసుకొన్నాడు. అయితే తఫానాకు ప్రవీణతో వివాహం కాకముందే గణేష్ అనే వ్యక్తిని ప్రేమించింది. గణేష్‌ను ప్రేమించి ప్రవీణ్‌ను ప్రేమ వివాహం చేసుకొంది. ప్రవీణ్‌తో వివాహం అయిన తర్వాత గణేష్‌‌తో ఆ ఆమె వివాహేతర సంబంధం కొనసాగించింది. 
 
అయితే తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని వారు భావించారు. దీంతో ఆమె భర్త ప్రవీణ్ ను హత్య చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ప్రియుడు గణేష్ సహయంతో భర్తను హత్య చేశారు. హత్య చేసి శవాన్ని గోనెసంచిలో వేసి ఆటోలో తీసుకెళ్ళి కాలువలో పడేశారు. అయితే మృతదేహన్ని తీసుకెళ్ళిన ఆటోను పురసైవాక్కం రోడ్డు పక్కన వదిలేశారు. అయితే ఈ ఆటో ఆదారంగా పోలీసులు ఈ కేసును చేధించారు.
 
ప్రవీణ్ భార్య తఫానాపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం వెలుగుచూసింది. ప్రవీణ్‌ను ప్రియుడితో కలిసి హత్య   చేసినట్టు ఆమె ఒప్పుకొంది. ఆమెకు సహకరించిన గణేష్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.