శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 1 జూన్ 2018 (11:31 IST)

చెల్లిని చూసేందుకు వచ్చి.. వివాహిత అక్కను లేపుకెళ్లిన యువకుడు.. ఎక్కడ?

ఆడపిల్లల తల్లిదండ్రులు కష్టాలు అన్నీఇన్నీకావని చెప్పొచ్చు. ఆ ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించేందుకు వారు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ఈ కష్టాలు ఇలావుంటే.. పోకిరీ యువకుల నుంచి తమ పిల్లలన

ఆడపిల్లల తల్లిదండ్రులు కష్టాలు అన్నీఇన్నీకావని చెప్పొచ్చు. ఆ ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించేందుకు వారు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ఈ కష్టాలు ఇలావుంటే.. పోకిరీ యువకుల నుంచి తమ పిల్లలను కాపాడుకోవడం ఆ తల్లిదండ్రులకు తలకుమించిన భారంగా మారింది.

కేవలం బహిరంగ ప్రదేశాల్లోనే కాకుండా ఇళ్లలో కూడా ఈ పోకిరీల బెడద తప్పడం లేదు. తాజాగా చెన్నైలో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. చిన్నమ్మాయి పెళ్లిచూపుల కోసం వచ్చిన ఓ యువకుడు పెళ్లి అయి ఓ బిడ్డ ఉన్న పెద్దమ్మాయిని బుట్టలో పడేసి ఏకంగా లేపుకెళ్ళాడు. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
చెన్నై, మైలాపూర్‌, ఏకాంబరం పిళ్లై వీధికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్దమ్మాయి వయసు 26 యేళ్లు. ఈమెకు వివాహమై ఒక కుమారుడు కూడా ఉన్నాడు. దీంతో 22 యేళ్ల చిన్నమ్మాయికి కూడా పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో సంబంధాలు వెతుకుతుండగా, అన్నాదురై (28) అనే యువకుడి సంబంధం గత జనవరిలో వచ్చింది. 
 
పెళ్లి చూపులకు వచ్చిన అతను, ఆసమయంలో పెద్దమ్మాయితో మాట కలిపాడు. చిన్నమ్మాయి పెళ్లి విషయమై ఎలాంటి నిర్ణయాన్ని చెప్పలేదుగానీ, పెద్దమ్మాయితో మాట్లాడుతూ దగ్గరయ్యాడు. ఈనేపథ్యంలో బుధవారం సాయంత్రం నుంచి పెద్ద కుమార్తె అదృశ్యమైంది. చివరకు ఆమె అన్నాదురైతో లేచిపోయిందని తెలుసుకున్న ఆ తండ్రి షాక్ తిన్నాడు. పైగా, ఆమె వెళుతూ వెళుతూ చిన్న కుమార్తె పెళ్లి కోసం ఉంచిన 5 సవర్ల బంగారం, రూ.2 లక్షల నగుదును తీసుకుని పారిపోయింది. దీంతో ఆ తండ్రి చెన్నై నగర పోలీసులను ఆశ్రయించాడు. ఆ జంట ఎక్కడుందో కనిపెట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.