శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 10 డిశెంబరు 2017 (15:56 IST)

మరుగుదొడ్డి నిర్మించాలంటే కోరిక తీర్చాలట.. ఎక్కడ?

దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బహిరంగ మలమూత్ర విసర్జనను నిషేధించారు. అదేసమయంలో స్వచ్ఛభారత్‌లో భాగంగా, ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టారు.

దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బహిరంగ మలమూత్ర విసర్జనను నిషేధించారు. అదేసమయంలో స్వచ్ఛభారత్‌లో భాగంగా, ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టారు. అయితే, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ అధికారులు మాత్రం మరుగుదొడ్డిని నిర్మించాలంటే కోరిక తీర్చాలంటూ షరతు విధిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌ జిల్లా తెందూదిపాలో ‘క్లీన్‌ ఇండియా’ పథకం కింద బాధితురాలి ఇంట్లో నిర్మిస్తున్న మరుగుదొడ్డి అక్రమమనీ, దాన్ని వెంటనే నిలిపివేయాలని రాయ్‌గఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ గతంలో నోటీసులిచ్చింది. దీంతో బాధితురాలు అన్ని ఆధారాలను సబ్‌ ఇంజినీర్‌ ఐపీ సారథికి సమర్పించారు. 
 
మరుసటి రోజు బాధితురాలికి ఫోన్‌చేసిన సారథి.. మరుగుదొడ్డి నిర్మాణానికి అనుమతి కావాలంటే తన కోరిక తీర్చాలన్నాడు. ఒప్పుకోకుంటే అక్రమ నిర్మాణం పేరుతో ఇంటినీ కూల్చేస్తానన్నాడు.  ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో సారథిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.