బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2017 (21:00 IST)

పెళ్లి పేరుతో వాడుకున్నాడు.. మోసపోయా.. చనిపోతున్నా...

హైదరాబాద్ నగరంలో ఓ దంతవైద్యురాలు బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ కామాంధుడికి తన కన్నెత్వాన్ని అప్పగించి మోసపోయింది. ఈ మోసాన్ని తట్టుకోలేని ఆమె ఆత్మహత్య చేసుకుంది.

హైదరాబాద్ నగరంలో ఓ దంతవైద్యురాలు బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ కామాంధుడికి తన కన్నెత్వాన్ని అప్పగించి మోసపోయింది. ఈ మోసాన్ని తట్టుకోలేని ఆమె ఆత్మహత్య చేసుకుంది. 
 
ఆ వైద్యురాలి పేరు గీతాకృష్ణ. హైదరాబాద్ నగరంలోని చైతన్యపురిలో నివశిస్తోంది. సొంతవూరు జగిత్యాల పట్టణం. చైతన్యపురిలోని ఓ వసతి గృహంలో ఉంటున్న అమె మంగళవారం ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
నరేశ్‌ అనే యువకుడు తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, అందుకే మానసికంగా కుంగిపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్ రాసిపెట్టింది. బలవన్మరణానికి ముందు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి ఆపై ఈ దారుణానికి పాల్పడినట్టు సమాచారం. 
 
హాస్టల్ సిబ్బంది ఇచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్‌కు చేరుకుని మృతదేహాన్ని కిందికి దించారు. గీతాకృష్ణ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.