మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2017 (11:58 IST)

కోల్‌కతాలో మైనర్ బాలికల వ్యభిచారం... నిర్వాహకుల అరెస్ట్

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో మైనర్ బాలికలతో వ్యభిచారం చేస్తున్న వ్యహారాన్ని స్థానిక పోలీసులు కనుగొన్నారు. ఇక్కడ ముగ్గురు మైనర్ బాలికలతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు నిందితులను కోల్‌క

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో మైనర్ బాలికలతో వ్యభిచారం చేస్తున్న వ్యహారాన్ని స్థానిక పోలీసులు కనుగొన్నారు. ఇక్కడ ముగ్గురు మైనర్ బాలికలతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు నిందితులను కోల్‌కతా సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. కోల్‌కతా నగరంలోని ఠాకూర్ పుకూర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ముగ్గురు నిందితులు ముగ్గురు బాలికలతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. 
 
దీంతో సీఐడీ పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి బాలికలకు వ్యభిచారం రొంపి నుంచి విముక్తి కల్పించి వారిని ప్రభుత్వ సదనానికి తరలించారు. వ్యభిచార గృహం నడుపుతున్న రింటూ మండల్ అలియాస్ జాయ్, శ్రాబని మండల్, జయామాఝీలను సీఐడీ పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.