గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2023 (16:05 IST)

రేపు కర్నాటక రాష్ట్ర బంద్ - తమిళనాడుకు కావేరీ జలాలు విడుదలకు వ్యతిరేకంగా...

karnataka people
తమిళనాడు రాష్ట్రానికి కావేరీ నదీ జలాలను విడుదల చేయడానికి వ్యతిరేకంగా కర్నాటక రాష్ట్రంలో మంగళవారం బంద్ పాటించనున్నారు. ఒప్పందం మేరకు తమిళనాడు రాష్ట్రానికి కావేరీ నీటి జలాలను విడుదల చేయాలని కావేరీ జలాల నిర్వహణ మండలి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను అమలు చేసేందుకు కర్నాటక  ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. దీన్ని వ్యతిరేకిస్తూ కన్నడ అనుకూల సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. 
 
ద కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఇటీవల తమిళనాడు 15 రోజుల పాటు రోజుకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో నీటి విడుదలపై ఈ నెల 26వ తేదీన నిర్ణయం తీసుకుంటామని కర్నాటక ప్రభుత్వం తెలిపింది. ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా కన్నడ అనుకూల సంస్థలు ఈ నెల 26వ తేదీన బంద్‌కు పిలుపునిచ్చాయి. 
 
కర్నాటక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. రేపటి రోజున బెంగుళూరుతో పాటు కర్నాటక వ్యాప్తంగా బంద్ చేపట్టాలనే ప్రతిపాదన కూడా ఉంది. దీనిపై ఆయా సంఘాలు సోమవారం తుది నిర్ణయాన్ని వెల్లడించనున్నాయి. కర్నాటక వాటర్ కన్జర్వేషన్ కమిటీ ప్రెసిడెట్ కురుబుల్ శంత‌కుమారు ఈ బంద్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఈ బంద్‌లో భాగంగా పాఠశాలలు, కాలేజీలు, ఐటీ కంపెనీలు, ఫిల్మ్ చాంబర్‌ కూడా బంద్‌కు మద్దతిచ్చి 26న సెలవు ప్రకటించాలని కోరారు. అదేసమయంలో ఈ బంద్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ప్రకటించింది.