శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 20 జూన్ 2017 (12:14 IST)

రద్దీ బస్సులో.. కండక్టర్ అభ్యంతరకరంగా తాకాడు.. చెంప వాయించిన యువతి ఎక్కడ?

మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అలాగే ఎక్కడపడితే అక్కడ మహిళలను వేధింపులకు గురిచేసే కామాంధులు ఎక్కువైపోతున్నారు. తాజాగా బస్సులో ఓ కండక్టర్ వేధించాడని.. ఆతడి చెంప ఛెల్లుమనిపించింది. ఈ ఘటన ఒడి

మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అలాగే ఎక్కడపడితే అక్కడ మహిళలను వేధింపులకు గురిచేసే కామాంధులు ఎక్కువైపోతున్నారు. తాజాగా బస్సులో ఓ కండక్టర్ వేధించాడని.. ఆతడి చెంప ఛెల్లుమనిపించింది. ఈ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తాను ప్రయాణిస్తున్న బస్సులో రద్దీ ఎక్కువగా ఉన్న వేళ, ప్యాసింజర్లను సర్దే క్రమంలో మహిళలను అసభ్యంగా తాకుతున్న కండక్టర్ చెంప వాయించింది.. ఓ యువతి. అంతేనా, ఆ ఘటనను ఫేస్ బుక్‌లో పంచుకోగా, పోలీసులు స్పందించారు. కేసు కూడా నమోదు చేశారు.
 
ఈ నెల 18న కటక్‌లో పని ముగించుకుని తిరుగు ప్రయాణంలో భువనేశ్వర్‌కు బయలుదేరిన యువతి రద్దీగా ఉండే బస్సులో ఎక్కేసింది. బస్సు కిటకిటలాడుతుండగా, మహిళా ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని కండక్టర్ అభ్యంతరకరంగా తాకుతున్నాడని గుర్తించింది. ఆమెకు కూడా అదే పరిస్థితి తలెత్తడంతో.. ఇక లాభం లేదనుకుని ధైర్యంగా ప్రవర్తించింది. అతని చెంప వాయించింది. 
 
జరిగిన ఘటనను సోమవారం నాడు తన ఫేస్ బుక్ ఖాతాలో బహిర్గతం చేసింది. సోషల్ మీడియాలో వచ్చే ఇటువంటి ఘటనలపైనా ఎఫ్ఐఆర్ నమోదు తప్పనిసరి కావడంతో, కటక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు.