ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Modified: శనివారం, 20 జులై 2019 (16:57 IST)

రాజకీయ యోధురాలు, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కన్నుమూత

కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ యోధురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కన్నుమూశారు. ఆమె ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఆసుపత్రిలో గత కొంతకాలంగా గుండెకి సంబంధించిన సమస్యలకు చికిత్స తీసుకుంటున్నారు. ఐతే శనివారంనాడు ఆరోగ్యం క్షీణించడంతో ఆమెకి అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆమె వయసు 81 సంవత్సరాలు. 
 
1998 నుంచి 2013 మధ్య కాలంలో వరుసగా 15 ఏళ్ల పాటు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఆమె పనిచేశారు. కాంగ్రెస్ పార్టీని ఢిల్లీలో అధికారంలోకి తెచ్చిన ఘనత ఆమెది. ఐతే 2013 తర్వాత ఆమె కేరళ రాష్ట్రానికి గవర్నర్‌గా కూడా పనిచేశారు. కాగా 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె పరాజయం పాలయ్యారు.