ఆదివారం, 23 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (12:55 IST)

మహిళలను స్వతంత్ర్యంగా, స్వేచ్ఛగా వదిలేయకూడదా.. యోగి అలా రాశారా?

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వివాదంలో చిక్కుకున్నారు. ఏడేళ్ల క్రితం మహిళలను కించపరిచేలా ఓ వ్యాసం రాయడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. తన వెబ్ సైట్లోని వీక్లీ జర్నల్‌లో రాసిన కథనం ప్రస్తుతం వివాదాస్పద

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వివాదంలో చిక్కుకున్నారు. ఏడేళ్ల క్రితం మహిళలను కించపరిచేలా ఓ వ్యాసం రాయడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. తన వెబ్ సైట్లోని వీక్లీ జర్నల్‌లో రాసిన కథనం ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఈ స్టోరీ మహిళలను కించపరిచేలా ఉందని యోగి ఆదిత్యనాథ్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా యోగి వెబ్ సైట్లో రాసిన కథనాన్ని కూడా కాంగ్రెస్ ఉటంకించింది. 
 
యోగి ఆదిత్యనాథ్ టాట్ ఇన్ వెబ్ సైట్ కామెంట్ సెక్షన్‌ తొలి స్థానంలో ఉన్న ఓ ఆర్టికల్‌లో మహిళా శక్తిని చిన్నతనంలో తండ్రి, వయస్సు వచ్చాక భర్త, వృద్ధాప్యంలో కుమారుడు రక్షించాలి. మహిళలను స్వతంత్ర్యంగా, స్వేచ్ఛగా వదిలేయకూడదంటూ రాసుకొచ్చారు. ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం వివాదాస్పదమైనాయి. మహిళల సాధికారతపై, సమానత్వంపై మాట్లాడే యోగి ఇలాంటి కథనాన్ని రాయడం ఏమిటని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. ఈ వ్యాసం ద్వారా బీజేపీ మైండ్ సెట్‌ను చెప్పకనే చెప్పారని విమర్శించారు. 
 
ఈ కామెంట్లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలు సైతం ఖండించకపోవడం శోచనీయమని అన్నారు. వెంటనే తన వెబ్ సైట్ నుంచి ఆర్టికల్ ను తొలగించి, మహిళలకు ఆయన క్షమాపణలు చెప్పాలని సుర్జేవాలా డిమాండ్ చేశారు.