శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (13:13 IST)

కరోనా పేషెంట్లు డ్యాన్స్ చేసిన వేళ.. వీడియో వైరల్

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇంకా కరోనా సోకిన పేషెంట్లనే జనం జడుసుకుంటున్నారు. అలాంటిది.. కరోనా పేషెంట్లు ఉల్లాసంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే... పంజాబ్‌లోని జలంధర్‌లో ఓ ఆసుపత్రిలో సుమారు 12 మంది కరోనా పేషెంట్లు టీవీ చూస్తున్నారు. 
 
అందులో హుషారైన పంజాబీ పాట రావడంతోనే వీరి నరాల్లో ఉత్తేజం ఉప్పొంగింది. వారికొచ్చిన కష్టాన్ని కాసేపు పక్కనపెట్టి చేతులూపుతూ, తలలాడిస్తూ కూర్చున్నచోటే ముఖానికి మాస్కులతో డ్యాన్సులు చేశారు. ఈ సంతోషకర సమయాన్ని జ్ఞాపకంగా మల్చుకునేందుకు అందులోని ఓ పేషెంట్ వీడియో చిత్రీకరించాడు. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీన్ని చూసిన నెటిజన్లు త్వరలోనే కరోనా మహమ్మారిని జయించాలని కోరుకుంటున్నారు.