గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 మే 2021 (08:14 IST)

కోవిడ్ ఆస్పత్రిలో అత్యాచారానికి గురైన మహిళా రోగి మృతి!

మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఓ మహిళా రోగిపై మేల్ నర్సు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో అత్యాచార బాధితురాలు కన్నుమూసింది. ఆమె ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆమె ప్రాణాలు విడిచింది. 
 
కాగా, ఏప్రిల్ 6వ తేదీన తనపై మేల్ నర్సు అత్యాచారం చేశాడని భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటరులో 43 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి గురైన మహిళ పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటిలేటరుకు తరలించారు. బాధిత మహిళ చికిత్స పొందుతూ మరణించారు. 
 
కరోనా రోగిపై అత్యాచారం చేసిన నిందితుడు 40 ఏళ్ల సంతోష్ అహిర్ వార్‌గా గుర్తించారు. పోలీసులు నిందితుడు సంతోష్‌ను అరెస్టు చేసి భోపాల్ సెంట్రల్ జైలుకు తరలించారు. నిందితుడు గతంలో కూడా 24 ఏళ్ల స్టాఫ్ నర్సుపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, గతంలో మద్యం తాగి విధులకు వచ్చాడని సస్పెండ్ అయ్యాడని ఆసుపత్రి వైద్యులు చెప్పారు.