బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 28 జులై 2021 (03:23 IST)

ఆగస్టులో పిల్లలకు కొవిడ్‌ టీకా

పిల్లల కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఆగస్టులో అందుబాటులోకి వస్తుందని బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు.

మరోవైపు అహ్మదాబాద్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా కంపెనీ తమ మూడు డోసుల కొవిడ్‌ టీకాను 12 ఏళ్లకు పైబడిన వారందరికీ ఇచ్చేందుకు అత్యవసర వినియోగ అనుమతులను కోరుతూ డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకుంది.

హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ 2-18 ఏళ్ల వారందరిపైనా కొవాగ్జిన్‌ను పరీక్షిస్తోంది. ఈ టీకా సెప్టెంబరుకల్లా పిల్లలకు అందుబాటులోకి రావచ్చంటున్నారు.

కాగా, దేశంలో రోజువారీ కరోనా కేసుల తగ్గుదల రేటు నెమ్మదించడం ఆందోళనకరమని కేంద్రం పేర్కొంది. 7 రాష్ట్రాల్లోని 22 జిల్లాల్లో పాజిటివ్‌లు పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. అజాగ్రత్త వహించవద్దని ప్రజలకు సూచించారు.