బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 22 జులై 2021 (08:33 IST)

ఆగస్టు 15 నుంచి టీటీడీ అగరబత్తుల అమ్మకం

టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పూలమాలలతో తయారు చేసే అగరబత్తులను ఆగస్టు 15 నుంచి అమ్మకాలు ప్రారంభించాలని ఈవో జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

దర్శన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ టీటీడీ నుంచి ముడిసరుకు, తయారీ ఖర్చు మాత్రం తీసుకుని అగరబత్తులను తయారు చేసిస్తుందన్నారు. వీటికి ధర నిర్ణయించి మొదట తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో విక్రయించాలన్నారు.

ఆ తర్వాత మరిన్ని చోట్లకు విస్తరించాలన్నారు. పంచగవ్యతో తయారు చేస్తున్న 15 రకాల ఉత్పత్తులపై ఈవో అధికారులతో చర్చించారు. వీటిని త్వరలో విడుదల చేయాలన్నారు.

టీటీడీ ఆయుర్వేద ఫార్మసీని ఆధునికీకరించేందుకు అవసరమైన యంత్రాల టెండర్‌ ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలన్నారు.   

ఇప్పటి వరకు 115 ఉత్పత్తులకు ఆయుష్‌ మంత్రిత్వశాఖ నుంచి అనుమతులు ఉన్నాయని, మరో 70 ఉత్పత్తుల తయారీకి లైసెన్సు తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.