శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2017 (12:32 IST)

ఆ ముఖ్యమంత్రిని పగబట్టిన కాకి.. ఇపుడు ఏం చేసిందో తెలుసా?

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఓ కాకి పగబట్టింది. నిజానికి ఇంటిపై చేరి కావ్.. కావ్ అంటూ అరిస్తే.. ఆ రోజు ఇంటికి చుట్టాలొస్తారన్నదానికి సంకేతం. అలాంటి కాకి పగబట్టిందా అంటే నమ్మశక్యంగా లేదు. కానీ, ఈ

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఓ కాకి పగబట్టింది. నిజానికి ఇంటిపై చేరి కావ్.. కావ్ అంటూ అరిస్తే.. ఆ రోజు ఇంటికి చుట్టాలొస్తారన్నదానికి సంకేతం. అలాంటి కాకి పగబట్టిందా అంటే నమ్మశక్యంగా లేదు. కానీ, ఈ కాకి మాత్రం సిద్ధరామయ్యను మాత్రం పగబట్టింది. ఆ వివరాలేంటో ఓసారి పరిశీలిద్ధాం.
 
గురువారం ఓ సాంస్కృతిక సంస్థ ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధరామయ్య గురువారం కేరళలోని మంజేశ్వర్ అనే ప్రాంతానికి వెళ్లారు. ఆ కార్యక్రమానికి సిద్ధ రామయ్యతో పాటు కేరళ సీఎం పినరయ్ విజయన్ కూడా విచ్చేశారు. వీరిద్దరితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు సైతం హాజరయ్యారు.
 
కేరళ సీఎం విజయన్ ప్రసంగిస్తుండగా... ఓ కాకి... కావ్ కావ్ కావ్ అంటూ అంటూ ఇటూ తిరుగుతోంది. ఆ కాకిని గమనించిన సిద్ధరామయ్య ‘ఇది ఇక్కడికీ వచ్చిందా’ అన్నట్లు అనుమానంగా చూస్తున్నారు. అలా విజయన్‌పైన తిరిగిన కాకి.. కాసేపటికే ఆయన మీద నుంచి వెళ్లి... స్టేజీ మీద కూర్చున్న కర్నాటక సీఎం సిద్ధరామయ్య సమీపంలోని చెట్టు కొమ్మపై వాలింది. తిన్నగా అక్కడి నుంచి సిద్ధరామయ్యపై రెట్ట వేసింది. అది ఆయన తెల్లని ధోవతి పడింది. దీన్ని గమనించిన ఆయన పక్కనే ఇతర ఎమ్మెల్యేలు టిష్యూ పేపర్‌తో ఆ రెట్టను తుడిచేశారు.
 
నిజానికి సిద్ధరామయ్యను కాకి వెంటాడటం ఇది తొలిసారి కాదు. గత యేడాది జూన్‌లో ఆయన కారుపై కాకి వాలింది.. అలా వాలడం అశుభమని భావించి.. ఆ కారును మార్చేశారు. అప్పుడంటే కారు మార్చారు కానీ.. ఇప్పుడు ఆయన మీదే వాలింది.. ఇప్పుడేం చేస్తారని రాజకీయంగా చర్చ జరుగుతోంది. కాకి వాలడం అశుభం అని కొందరంటే.. శుభసూచకం అని మరికొందరంటున్నారు.