మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (11:20 IST)

తిక్రీ గ్రామంలో సిలిండర్ పేలి ఏడుగురు మృతి.. ఇళ్లు ధ్వంసం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోండా జిల్లా తిక్రీ గ్రామంలో ఘోర సంఘటన జరిగింది. ఈ గ్రామంలోని ఓ ఇంట్లో మంగళవారం రాత్రి గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ప్రమాదంలో రెండు గృహాలు కూలిపోగా, ఏడుగురు మృత్యువాతపడ్డారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
 
ఈ క్షతగాత్రులను వెంటనే స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్పీ సంతోష్‌కుమార్‌ మిశ్రా సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. శిథిలాల కింద చిక్కుకున్న మరో 14 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.