సోమవారం, 3 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 1 జూన్ 2016 (13:39 IST)

నిజమే.. దాద్రిలో లభించింది ఆవు మాంసమే.. ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోన దాద్రి అనే ప్రాంతంలో ఆవు మాంసం భక్షించారని పేర్కొంటూ 50 యేళ్ళ మొహ్మద్ ఇక్బాల్ అనే ముస్లిం కుటుంబ యజమానిని కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టి చంపిన విషయం తెల్సిందే.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోన దాద్రి అనే ప్రాంతంలో ఆవు మాంసం భక్షించారని పేర్కొంటూ 50 యేళ్ళ మొహ్మద్ ఇక్బాల్ అనే ముస్లిం కుటుంబ యజమానిని కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టి చంపిన విషయం తెల్సిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతేనా.. దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ పలువురు వీవీఐపీలు వ్యాఖ్యానించారు. ఈ అసహనం వ్యాఖ్యలు దేశ రాజకీయాలను ఓ కుదుపు కుదిపాయి కూడా. 
 
ఈ నేపథ్యంలో.. ఆ ముస్లిం వ్యక్తి ఇంట్లో లభించిన మాంసం 'మటన్' అని, బీఫ్ కాదని స్థానిక వైద్యుడు ఒకరు చెప్పారు. కానీ.. ఆ ఘటన జరిగిన 8 నెలల తర్వాత ఈ కేసు సరికొత్త మలుపు తిరిగింది. అక్కడ లభించింది. ఆవు లేదా దూడ మాంసమేనని ఫోరెన్సిక్ పరీక్షలో తేలింది. తొలుత అది మటన్ అనే తాము భావించామని, కానీ తర్వాత అది ఆవుమాంసం అన్న విషయం తేలిందని యూపీ డీజీపీ జావేద్ అహ్మద్ తెలిపారు. 
 
కాగా, ఈ మొహ్మద్ ఇక్బాల్ హత్య కేసులో 18 మందిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు బీజేపీ నేత కుమారుడు కూడా ఉన్నారు. దీనిపై ఆ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. యూపీలో గోవు మాంసం తినడం నేరం కాదనీ, ఆవును చంపడం నేరమని పేర్కొన్నారు. ఈ కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.