బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 4 జూన్ 2017 (18:03 IST)

సేమ్ సీన్: గంటలో పెళ్లి.. డ్యాన్స్ చేస్తూ.. కుప్పకూలిన వరుడు గుండెపోటుతో మృతి...

పెళ్లి వూరేగింపులో డ్యాన్స్‌ చేస్తున్న పెళ్లికొడుకు ఇటీవల గుజరాత్‌లో మరణించిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని వడోదరకు చెందిన వరుడిని అతని స్నేహితులు భుజంపై ఎక్కించుకుని పెళ్లికి వూరేగింపుగా తీసుకెళ్తున్

పెళ్లి వూరేగింపులో డ్యాన్స్‌ చేస్తున్న పెళ్లికొడుకు ఇటీవల గుజరాత్‌లో మరణించిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని వడోదరకు చెందిన వరుడిని అతని స్నేహితులు భుజంపై ఎక్కించుకుని పెళ్లికి వూరేగింపుగా తీసుకెళ్తున్నారు. పెళ్లికొడుకు కూడా ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశాడు. ఇంతలో ఏమైందో ఏమో గానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆపై ప్రాణాలు వదిలాడు. ఇలాంటి ఘటనే తాజాగా బీహార్‌లో చోటుచేసుకుంది. మరో గంటలో వధూవరులు వివాహ బంధంతో ఒకటవుతారనగా వరుడు గుండెపోటుతో మరణించాడు. 
 
వివరాల్లోకి వెళితే.. కైమూర్‌ జిల్లాకి చెందిన శశాంక్‌ పాండే(25) అనే యువకుడికి శుక్రవారం వివాహం జరగాల్సి ఉంది. అప్పటివరకు స్నేహితులతో డ్యాన్స్‌ చేస్తూ ఎంజాయ్‌ చేసిన శశాంక్‌ మండపంలోకి వెళుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు, తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ మార్గమధ్యంలోనే వరుడు చనిపోయాడు. కాబోయే భర్త కళ్లముందే చనిపోవడంతో వధువు కన్నీరుమున్నీరైంది.