ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 19 మార్చి 2017 (10:55 IST)

దీప భర్త కొత్త పార్టీ.. హర్యానాలోనూ అమ్మ క్యాంటీన్లు..

కొత్త పార్టీ పెడతానంటూ తన భర్త ప్రకటించడం తప్పని.. జయలలిత మేనకోడలు దీప వ్యాఖ్యానించారు. తన సొంత మనుషులే తనకు వ్యతిరేకంగా నడుచుకోవడం మనస్తాపం కలిగిస్తోందని వాపోయారు. ఆర్.కె.నగర్ నియోజకవర్గం ఉప ఎన్నికలో

కొత్త పార్టీ పెడతానంటూ తన భర్త ప్రకటించడం తప్పని.. జయలలిత మేనకోడలు దీప వ్యాఖ్యానించారు. తన సొంత మనుషులే తనకు వ్యతిరేకంగా నడుచుకోవడం మనస్తాపం కలిగిస్తోందని వాపోయారు. ఆర్.కె.నగర్ నియోజకవర్గం ఉప ఎన్నికలో తనను పోటీ చేయనివ్వకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని జయలలిత మేనకోడలు దీప ఆరోపించారు.

తన భర్త ఆకస్మికంగా కొత్త పార్టీ పెడతానని చేసిన ప్రకటన పట్ల షాక్ ఇచ్చిన దీప జయకుమార్ తెలిపారు. అతని వెనుక శశికళ వర్గం ఉందని, అసత్య ప్రచారాలను వాళ్ళే చేయిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రచారాన్ని ఎంజీఆర్, అమ్మా దీపా పేరవై కార్యకర్తలు నమ్మరాదని దీప కోరారు.
 
ఇదిలా ఉంటే.. తమిళనాడులో ‘అమ్మ’ క్యాంటీన్లు, మంచినీటి పథకాలు దేశవ్యాప్తంగా కీర్తిప్రతిష్ఠలు సంపాదిస్తున్నాయి. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేయడానికి ముందుకొచ్చింది. తాజాగా ఈ జాబితాలో హర్యానా కూడా చేరుతోంది. హర్యానా మంత్రి నయబ్ సింగ్ సైనీ నేతృత్వంలో అధికారుల బృందం చెన్నైలోని ‘అమ్మ’ క్యాంటీన్లను పరిశీలించింది. తమ రాష్ట్రంలో కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. నగరంలోని మంచినీటి పథకాలను కూడా ఈ బృందం అధ్యయనం చేసింది.