ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 జులై 2022 (14:06 IST)

ఫ్రిజ్‌లో కుక్కిన శవం.. హత్యచేసిందెవరు.. ఎక్కడ జరిగింది?

murder
ఢిల్లీలోని సీలంపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని చంపి, అతడి మృతదేహాన్ని ఫ్రిజ్‌లో కుక్కి పెట్టారు. వివరాల్లోకి వెళితే.. సీలంపూర్‌లో ఫ్రిజ్‌లో మృతదేహాన్ని గుర్తించిన ఓ మహిళ గత రాత్రి 7.15 గంటలకు తమకు ఫోన్ చేసి సమాచారం అందించిందని పోలీసులు అన్నారు. 
 
బాధితుడి కుటుంబానికి చెందిన వారు అతడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అతడి ఇంటికి వెళ్ళారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఫ్రిజ్‌లో అతడి మృతదేహాన్ని గుర్తించారని తెలిపారు. 
 
మృతుడి పేరు జకీర్ అని తెలిపారు. అతడు కొంత కాలంగా ఆ ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. జకీర్ భార్య, అతడి పిల్లలు వేరే ప్రాంతంలో ఉంటున్నారని తెలిపారు. జకీర్ హత్య ఘటనపై తదుపరి విచారణ జరుపుతున్నామని వివరించారు.