శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

రూ.కోటి విలువైన డ్రగ్స్‌తో పట్టుబడిన మోడల్

drugs
ఢిల్లీలో కోటి రూపాయల విలువ చేసే మాదకద్రవ్యాలతో ఓ మోడల్ పట్టుబట్టాడు. ఈయనను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా 25 యేళ్ల మోడల్‌తో పాటు అతని ప్రియురాలిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారిని శుభమ్ మల్హోత్రా అలియాస్ సన్నీ, స్నేహితురాలు కీర్తి (27)గా గుర్తించారు. వీరిద్దరూ ఢిల్లీ విశ్వవిద్యాలయ క్యాంపస్ డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. 
 
ఢిల్లీ యూనివర్సిటీ చుట్టుపక్కల కొందరు డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టిన పోలీసులు ఈ రాకెట్‌లో సన్నీ ప్రధాన పాత్రధారని గుర్తించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మలానా నుంచి సన్నీ డ్రగ్స్ తీసుకొచ్చి ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంతంలో విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.