1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్

కొత్త కేసులు 20 వేల పాజిటివ్ కేసులు - 200 కోట్ల మైలురాయికి టీకాలు

covid
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 20 వేలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో క్రియాశీలక కేసులు 1.5 లక్షలకు చేరువ కావడం ఇపుడు ఆందోళన కలిగించే అంశం. దేశంలో కరోనా టీకా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ 200 కోట్ల మైలురాయికి సమీపిస్తుండటం విశేషం. 
 
ఇదే అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 3,92,569 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 20,528 కేసులు వెలుగులోకి వచ్చాయి. 
 
24 గంటల్లో కరోనాతో 49 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటివరకూ మృతి చెందిన వారి సంఖ్య 5,25,709కు చేరింది. శనివారం 17,790 మంది కోలుకోగా ఇప్పటివరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.3 కోట్లు (98.47 శాతం) దాటింది. ఇక క్రియాశీల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 1,43,449 (0.33 శాతం)యాక్టివ్ కేసులు ఉన్నాయి.
 
దేశంలో టీకాల పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న 25,59,840 మందికి టీకాలు వేయగా.. ఇప్పటివరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,99,98,89,097కు చేరింది.