ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 4 జూన్ 2020 (09:11 IST)

ఢిల్లీ కేంద్రంగా పిల్లల అశ్లీల వెబ్‌సైట్

ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న ఛైల్డ్ ఫోర్నోగ్రఫీ సైట్ గుట్టు రట్టయింది. దీనిపై దృష్టి సారించిన సీబీఐ కేసు నమోదు చేసింది. అభ్యంతరకరమైన పిల్లల అశ్లీల చిత్రాలను పోస్టు చేసిన పోర్న్ వెబ్ సైట్ ను ఢిల్లీ కంపెనీ రష్యా డొమైన్ తో నిర్వహిస్తుందని సీబీఐ అధికారుల దర్యాప్తులో తేలింది.

దీంతో సీబీఐ అధికారులు సదరు కంపెనీపై దాడి చేసి కంపెనీ డైరెక్టర్లపై పోస్కో, ఐటీ యాక్ట్ ల కింద కేసు నమోదు చేశారు.భారతదేశంతోపాటు నెదర్లాండు, రష్యాదేశాల నుంచి సర్వర్లు ఏర్పాటు చేసి ఛైల్డ్ పోర్నోగ్రఫీని పోస్టు చేస్తున్నారు. పోర్న్ సైట్ కార్యాలయంలో దాడులు చేసిన సీబీఐ అధికారులు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు.

పిల్లల అశ్లీల చిత్రాలను ఏడుగురు వ్యక్తులు వాట్సాప్ గ్రూపులు, వెబ్ సైట్లలో పోస్టు చేస్తున్నారని సీబీఐ అధికారుల దర్యాప్తులో తేలింది. భారత్ తోపాటు శ్రీలంక, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, అమెరికా, న్యూజిలాండ్, మెక్సికో, చైనా నైజీరియా, బ్రెజిల్, కెన్యా దేశాల్లోని 234 మందికి అశ్లీల చిత్రాలు చేరవేశారని తేలింది.