శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 2 జూన్ 2020 (09:01 IST)

ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సరిహద్దుల మూసివేత

ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో తీవ్రంగా తలమునకలై వున్న ఢిల్లీ ప్రభుత్వం.. మరో అస్త్రం ప్రయోగించింది.

కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వారం రోజుల పాటు ఢిల్లీ సరిహద్దులను మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు.

అత్యవసరసేలు అందించే ప్రజలు, ప్రభుత్వ పాసులు కల్గి ఉన్నవారిని మాత్రమే సరిహద్దులు దాటేందుకు అనుమతిస్తామని చెప్పారు.

పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేసేందుకు హాస్పిటల్స్‌కు, వైద్య సంస్థలకు అవకాశం ఇచ్చేందుకే సరిహద్దులను తాత్కాలికంగా మూసివేసినట్లు చెప్పారు.

కరోనా కేసుల సంఖ్య పెరగడం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అది భయాందోళనలకు దారి తీయకూడదని కేజ్రీవాల్‌ అన్నారు.