శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 ఆగస్టు 2018 (16:57 IST)

సిగరెట్ షాపుకు దారెటని అడిగితే కొట్టి చంపేశారు... ఎక్కడ?

ఢిల్లీలో దారుణం జరిగింది. సిగరెట్ షాపుకు దారి ఎటు అని అడిగిన ఇద్దరు యువకులను ఓ మద్యంబాబు చితకబాదాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు అక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుత

ఢిల్లీలో దారుణం జరిగింది. సిగరెట్ షాపుకు దారి ఎటు అని అడిగిన ఇద్దరు యువకులను ఓ మద్యంబాబు చితకబాదాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు అక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో నవీన్, రాహుల్ అనే ఇద్దరు వ్యక్తులు పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి నవీన్ ఇంటికి రాహుల్ వచ్చాడు. వీరిద్దరూ కలిసి రాత్రి సమయంలో బయటకు వచ్చారు. ఆ తర్వాత రోహిణి ఏరియాలో సిగరెట్ల దుకాణం ఎక్కడ ఉందని మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తిని అడిగారు. 
 
దీంతో ఆగ్రహించిన అతను రాహుల్, నవీన్‌ను చితకబాదాడు. మరో ఇద్దరిని పిలిపించి చావుదెబ్బలు కొట్టించాడు మద్యం సేవించిన వ్యక్తి. తీవ్ర గాయాలపాలైన రాహుల్, నవీన్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాహుల్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించగా, నవీన్ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.