ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 19 జూన్ 2017 (09:16 IST)

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. మనస్పర్ధలతో విడిపోయాడు.. సర్‌ప్రైజ్ ఇస్తానని గొంతు కోశాడు..

ప్రేమతో వంచించే ఉన్మాదులు ఎక్కువైపోతున్నారు. ప్రేమ పేరుతో మోసం చేస్తున్నారు. ఆపై హత్యలు చేసేందుకూ వెనుకాడట్లేదు. తాజాగా ఓ ఉన్మాది ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను గొంతు నులిమి చంపేశాడు. మొన్నటికి మొన

ప్రేమతో వంచించే ఉన్మాదులు ఎక్కువైపోతున్నారు. ప్రేమ పేరుతో మోసం చేస్తున్నారు. ఆపై హత్యలు చేసేందుకూ వెనుకాడట్లేదు. తాజాగా ఓ ఉన్మాది ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను గొంతు నులిమి చంపేశాడు. మొన్నటికి మొన్న బెంగళూరులో భార్యతో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మరవక ముందే భార్యకు మనస్పర్ధలతో దూరమైన ఓ భర్త.. చాలారోజుల తర్వాత ఆమెను కలిసి నమ్మించి గొంతుకోశాడు. ఈ ఘటన ఢిల్లీలోని బోంటా పార్కులో శుక్రవారం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే..  మనోజ్‌కుమార్‌(24) అనే వ్యక్తి తన భార్య కోమల్‌(22) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ మనస్పర్థలతో భార్యకు మనోజ్ దూరమయ్యాడు. చాలాకాలం తర్వాత ఆమెను కలిశాడు. తాను మారిపోయానని, సర్‌ప్రైజ్‌ ఇస్తానని, కళ్లు మూసుకొమ్మని అన్నాడు. ప్రేమగా భర్త చెప్పిన మాటలు నమ్మి.. కళ్లు మూసుకోగానే వైరుతో గొంతు బిగించి చంపేశాడు.
 
పార్కుకు తీసుకెళ్లి సర్‌ప్రైజ్ ఇస్తామని మనోజ్‌కుమార్‌(24) భార్యను హతమార్చాడు. భార్యను హతమార్చేందుకు మనోజ్ కుమార్ స్నేహితుడి సాయం కోరాడు. కానీ అతడు వెంటనే పోలీసులకు ఫోన్ చేయడంతో కొద్ది గంటల్లోనే కేసు నమోదు చేసుకుని మనోజ‌్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే మనోజ్ భార్య కోమల్‌ను మాత్రం రక్షించలేకపోయారు.