శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 జూన్ 2020 (09:56 IST)

ఫలించిన ప్లాస్మా థెరపీ... కోలుకున్న ఢిల్లీ వైద్యమంత్రి

కరోనా వైరస్ బారినపడిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తిరిగి కోలుకున్నారు. ఆయనకు చేసిన ప్లాస్మా థెరఫీ చికిత్స ఫలించడంతో ఆయన ఆరోగ్యం మెరుగుపడినట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి. 
 
ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనకు చికిత్స జరుగుతోంది. మూడు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం విషమించగా ప్లాస్మా థెరపీని చేయాలని అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. 
 
ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్న ఓ వ్యక్తి నుంచి సేకరించిన ప్లాస్మాను సత్యేంద్ర జైన్ శరీరంలోకి వైద్యులు ఎక్కించారు. ఈ చికిత్స సత్ఫలితాలను ఇచ్చింది. ఆయనలో పెరిగిన యాంటీ బాడీలు వైరస్‌ను నిరోధించాయి. 
 
ప్రస్తుతం జైన్ చికిత్సకు స్పందిస్తున్నారని, మరో 24 గంటల పాటు జ్వరం, శ్వాస ఇబ్బందులు తలెత్తకుంటే, ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలిస్తామని వైద్య బృందాలు వెల్లడించాయి. తొలుత రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరిన ఆయనను, ఆపై మ్యాక్స్ హాస్పిటల్‌కు తరలించారు.