శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 జులై 2017 (09:07 IST)

పాఠశాల మరుగుదొడ్డిలో ప్రసవించిన టెన్త్ విద్యార్థిని.. ఎక్కడ?

దేశరాజధాని న్యూఢిల్లీలో మరో దారుణం వెలుగు చూసింది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పాఠశాల మరుగుదొడ్డిలోనే ప్రసవించింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఢిల్లీ మలిక్‌పూర్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలో

దేశరాజధాని న్యూఢిల్లీలో మరో దారుణం వెలుగు చూసింది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పాఠశాల మరుగుదొడ్డిలోనే ప్రసవించింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఢిల్లీ మలిక్‌పూర్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలో ఓ యువతి పదో తరగతి చదువుతోంది. ఈమె స్కూల్ బాత్రూమ్‌లో మృతశిశువుకు జన్మనిచ్చింది. గతంలో తనపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడని బాధితురాలు చెప్పింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 
 
పోలీసుల విచారణలో ఆ డ్రైవర్.. బాలికపై నాలుగైదుసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. బాలికను ప్రలోభపెట్టేందు డబ్బు ఆశచూపి లొంగదీసుకునేవాడని తేలింది. బాలికకు మొదట్లో తాను గర్భవతిననే విషయం తెలియలేదు. విషయం తెలిసిన తరువాత ఆ డ్రైవర్ బాలికకు అబార్షన్ చేయించే ప్రయత్నం చేశాడు. కాని అది సాధ్యపడక పోవడంతో పాఠశాల బాత్రూమ్‌లో ప్రీ డెలివరీ జరిగింది. బాధితురాలి తల్లిదండ్రులు కూడా తమ కుమార్తె గర్భంతో ఉందని తెలుసుకోలేక పోవడం విశేషం.