సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 ఫిబ్రవరి 2022 (22:07 IST)

ఢిల్లీ సీమాపురిలో కలకలం రేపిన అనుమానాస్పద బ్యాగు

దేశ రాజధాని ఢిల్లీలోని సిమాపురిలో ఓ అనుమానాస్పద బ్యాగు కలకలం రేపింది. ఓ ఇంటి వద్ద ఈ బ్యాగు కనిపించగా, ఇది ప్రతి ఒక్కరినీ భయాందోళనలకు గురిచేసింది. సమాచారం అందున్న ఢిల్లీ స్పెషల్ పోలీస్ బృందం ఈ బ్యాగును తనిఖీ చేయగా, అందులో పేలుడు పదార్థాలు ఉన్నట్టు గుర్తించి, తక్షణం ఎన్.ఎస్.జి విభాగానికి సమాచారం అందించారు.
 
ఆ వెంటనే రంగంలోకి దిగిన ఎన్.ఎస్.జి ఆ బ్యాగును స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ఆ బ్యాగును ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్ళి అందులోని పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశారు. ఈ బ్యాగుకు సంబంధించి నలుగురు వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బ్యాగు లభించిన ఇంటిలో ఉండే నలుగురు యువకుల కోసం ఢిల్లీని జల్లెడ పడుతున్నారు.