శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2019 (11:36 IST)

ఫ్రెండ్‌షిప్ ముసుగులో మహిళపై గ్యాంగ్ రేప్

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. స్నేహం ముసుగులో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘాతుక చర్యకు ఆ మహిళకు ముగ్గురు స్నేహితులే పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉజ్బెకిస్ధాన్‌కు చెందిన 31 సంవత్సరాల మహిళ తనపై ఢిల్లీలోని వసంత్‌కుంజ్‌ ప్రాంతంలో నివసిస్తోంది. ఈమెకు అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులతో పరిచయం ఉంది. అయితే, ఈ ముగ్గురు కలిసి ఆ మహిళపై ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేయగా, గురుగ్రామ్‌కు చెందిన ఓ నిందితుడు ఆమెకు పరిచయస్తుడేనని చెప్పారు. బాధిత మహిళను ఎయిమ్స్‌కు తరలించగా, ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.