బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 13 జనవరి 2017 (04:58 IST)

లీవు ఇవ్వనందుకు రెచ్చిపోయిన సైనికుడు.. కాల్పుల్లో 4 సీనియర్ల మృతి

కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగం (సీఐఎస్ఎఫ్)కి చెందిన ఒక జవాన్ గురువారం నలుగురు సీనియర్లను కాల్చి చంపాడు. లీవు అడిగితే ఇవ్వలేదన్నదే కారణంగా తెలుస్తోంది. పాట్నాకు 150 కిలోమీటర్ల దూరంలోని ఔరంగాబాద్ జిల్లాలో నబీ నగర్ పవర్ జనరేషన్ కంపెనీ ఆవరణలోని సైనిక బ్య

సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుల దుర్భర జీవన పరిస్థితులపై దేశ పారామిలటరీ బలగాలకు చెందిన జవాన్లు తమ అసంతృప్తిని వెలిబుచ్చుతూనే ఉన్నారు. సైనికాధికారులు లోపలిరోగానికి పూతమందు పూస్తూనే ఉన్నారు ఈలోపు మరో ఘాతుకం జరిగిపోయింది. కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగం (సీఐఎస్ఎఫ్)కి చెందిన ఒక జవాన్ గురువారం నలుగురు సీనియర్లను కాల్చి చంపాడు. లీవు అడిగితే ఇవ్వలేదన్నదే కారణంగా తెలుస్తోంది. పాట్నాకు 150 కిలోమీటర్ల దూరంలోని ఔరంగాబాద్ జిల్లాలో నబీ నగర్ పవర్ జనరేషన్ కంపెనీ ఆవరణలోని సైనిక బ్యారక్‌ వెలుపల ఈ ఘాతుక చర్య జరిగింది. 
 
గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు కానిస్టేబుల్ బల్వీర్ సింగ్ భోజనం ముగించుకుని బ్యారక్ చేరుకున్నాడని, వెనువెంటనే తన ఇన్శాస్ రైఫిల్ తీసి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడని సీఐఎస్ఎప్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం తెలిపింది.బల్వీర్ 32 రౌండ్లు కాల్చిన తర్వాత మాజీ ఎస్పీజీ సభ్యుడు రాజేష్ కుమార్ అతడిని నిరాయుధుడిని చేశాడని అధికారులు ప్రకటించారు. 
 
ఆలీఘర్ వాస్తవ్యుడైన బల్వీర్‌కు సీఐఎస్ఎప్ అధికారుల ఇళ్ల ముందు కాపాలా బాధ్యతలు కేటాయించారు. సీనియర్లపై కాల్పులు జరిపిన సమయానికి అతడి వద్ద 120 రౌండ్ల తూటాలు ఉన్నాయని ఔరంగాబాద్ ఎస్పీ సత్యప్రకాష్ తెలిపారు. తనకు లీవ్ ఇవ్వలేదని ఆగ్రహం చెందిన బల్వీర్ ప్రతీకారంతోటే కాల్పులు జరిపినట్లు ఎస్పీ తెలిపారు. లీవు ఇవ్వని కారణందా అతడు తీవ్రంగా ఆశాభంగం చెందినట్లు కనిపిస్తోందని కానీ అతడు తన సమస్య గురించి నేరుగా అధికారులకు చెప్పలేదని ఎస్పీ  పేర్కొన్నారు. ఇంటరాగేషన్ సమయంలో తన కుటుంబంలో ఇటీవలి జరిగిన హత్య గురించి ప్రస్తావించాడు కానీ వివరాలు చెప్పలేదన్నారు.
 
అయితే లీవు అనేది ఒక సమస్చే కాదని సీఐఎస్ఎఫ్ చెబుతోంది. ఇటీవలే ఎనిమిది రోజులు లీవు తీసుకుని జనవరి 4నే అతడు డ్యూటీలో చేరాడని, తనకు మళ్లీ లీవు కావాలని అతడు అడగలేదని సీఐఎస్ఎఫ్ పీఆర్వో మంజిత్ సింగ్ చెప్పారు. వాస్తవానికి గత సంవత్సర కాలంగా పలు సందర్భాల్లో అతడు రెండున్నర నెలలు లీవు తీసుకున్నాడని, వార్షిక లీవుల కంటే ఎక్కువగానే అతడు లీవులు పొందాడని మంజిత్ వివరించారు. కాబట్టి అతడి విషయంలో లీవు అనేది ఒక సమస్యే కాదని స్పష్టం చేశారు.
 
బల్వీర్ జరిపిన కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ అరవింద్ కుమార్, అమరనాథ్ మిశ్రా అక్కడికక్కడే చనిపోగా, ఏఎస్ఐ గౌరీశంకర్ రామ్, హెడ్ కానిస్టేబుల్ బచ్చా శర్మ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు. 
 
అత్యంత క్రమశిక్షణ కలిగిన సైనికుడు తన సహచరులపైనే కాల్పులు జరపడానికి కారణం తెలియడం లేదు. లీవు కాకపోతే మరే సమస్య దీనికి కారణమై ఉంటుందన్నది తెలియరావడం లేదు. 
 
ఏదేమైనా భారత సైనిక, అర్ధ సైనిక బలగాల్లో తీవ్ర అసంతృప్తి రాజుకుంటోందని వరుస ఘటనలు చెబుతున్నాయి. తమకు తిండి సరిగా పెట్టలేదని ఒకరు, అధికారులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని ఒకరు.. సైనిక జీవితంలో లుకలుకలకు తార్కాణంగా నిలుస్తున్నారు.