శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 5 జూన్ 2017 (09:46 IST)

ఆంబులెన్స్‌ లేకపోవడంతో బైక్‌పై మృతదేహాన్ని తరలించిన వ్యక్తి.. ఎక్కడ?

ప్రైవేట్ వాహనానికి డబ్బులు కట్టే స్తోమత లేకపోవడంతో ఓ భర్త తన భార్య మృతదేహాన్ని బైక్‌పై ఇంటికి తరలించాడు. ప్రభుత్వ వాహనాన్ని ఇచ్చేందుకు ఆస్పత్రి సిబ్బంది నిరాకరించడంతో.. భార్య మృతదేహాన్ని బైక్‌పై ఇంటిక

ప్రైవేట్ వాహనానికి డబ్బులు కట్టే స్తోమత లేకపోవడంతో ఓ భర్త తన భార్య మృతదేహాన్ని బైక్‌పై ఇంటికి తరలించాడు. ప్రభుత్వ వాహనాన్ని ఇచ్చేందుకు ఆస్పత్రి సిబ్బంది నిరాకరించడంతో.. భార్య మృతదేహాన్ని బైక్‌పై ఇంటికి తరలించాడు. ఈ ఘటన బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో ఈ అమానుషం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పూర్ణియా జిల్లా రణిబరి గ్రామానికి చెందిన శంకర్ షా (60), సుశీల దేవి (50) భార్యాభర్తలు. 
 
ఇటీవల అనారోగ్యం కారణంగా పుర్ణియా సదర్ ఆసుపత్రిలో చేరిన సుశీల.. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మరణించింది. అంత్యక్రియల కోసం ఆమె మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు శంకర్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆస్పత్రి సిబ్బంది మార్చురీ వ్యాన్ ఇచ్చేందుకు నిరాకరించారు. 
 
ప్రైవేట్ వాహనాన్ని ఏర్పాటు చేసుకునే స్తోమత లేకపోవడంతో కుమారుడు బైక్ తీసుకురాగా.. మధ్యలో తల్లి మృతదేహాన్ని పెట్టి వెనక తండ్రి కూర్చోగా ఇంటికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ పంకజ్ కుమార్ పాల్ విచారణకు ఆదేశించారు.