మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2016 (10:54 IST)

సుదీర్ఘకాలం పడక గదిని పంచుకోనివ్వకుంటే విడాకులే: ఢిల్లీ హైకోర్టు

భార్యాభర్తలు సుదీర్ఘకాలం పాటు పడక గది పంచుకోకుండా ఉంటే అలాంటి వారు విడాకులు పొందే హక్కు భార్యాభర్తలకు ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. నాలుగున్నరేళ్లుగా, భార్య తనను దగ్గరకు చేర్చడం లేదని, ఆమెకు

భార్యాభర్తలు సుదీర్ఘకాలం పాటు పడక గది పంచుకోకుండా ఉంటే అలాంటి వారు విడాకులు పొందే హక్కు భార్యాభర్తలకు ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. నాలుగున్నరేళ్లుగా, భార్య తనను దగ్గరకు చేర్చడం లేదని, ఆమెకు శారీరక ఇబ్బందులు, సమస్యలు లేకున్నా, తనను మానసిక హింసకు గురి చేస్తోందని ఓ భర్త వేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, అతనికి విడాకులు మంజూరు చేసింది. 
 
ఈ సందర్భంగా జస్టిస్ ప్రదీప్ నందరాజోగ్, జస్టిస్ ప్రతిభారాణిలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో భార్య వల్ల భర్తకు ఎంతో మానసిక ఆందోళన కలిగిందని, ఒకే ఇంట్లో ఉంటున్నా అతడికి సంసార సుఖం దక్కలేదని, ఎలాంటి కారణం లేకుండా శృంగారాన్ని నిరాకరించారని తేలడం వల్ల విడాకులు ఇవ్వొచ్చని తేల్చిచెప్పింది.