మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 నవంబరు 2024 (13:31 IST)

షిండే రాజీనామా : మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవిస్‌కే ఛాన్స్ : అజిత్ పవార్

ajit pawar
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఏక్‌‍నాథ్ షిండే రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఎన్సీపీ నేత అజిత్ పవార్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి షిండే రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయని అజిత్ పవార్ వెల్లడించారు. 
 
తమ పార్టీల కోసం ఏక్‌నాథ్‌ షిండే, అజిత్ పవార్‌లు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరని అన్నారు. ఈ రెండు పార్టీలు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి హోం మంత్రి అమిత్‌షా కనుసన్నల్లోనే నడుస్తాయని.. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ మెజారిటీ సాధించింది కాబట్టి వారికి అవకాశం ఉండకపోవచ్చన్నారు. 
 
మరోవైపు, మహారాష్ట్ర 14వ శాసనసభ కాలపరిమితి మంగళవారంతో ముగియనుంది. దీంతో ఆలోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకాకపోతే రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుందన్న వార్తలొచ్చాయి. వాటిని అధికారులు ఖండించినప్పటికీ.. కొత్త సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఒకవేళ, బీజేపీకి అవకాశం వస్తే దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి అవుతారా అన్న దానిపైనా స్పష్టత లేదు. 
 
అలాగే, 2019లోనూ బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా సీఎం విషయంలో విభేదాలు తలెత్తాయి. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో బీజేపీ ఉద్ధవ్‌ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి కూడా బీజేపీ అతిపెద్ద పార్టీ అయినా మెజారిటీకి ఇంకా కొంత దూరంలోనే నిలిచిపోయింది. అయితే ఈసారి అజిత్‌ రూపంలో మద్దతుదారు ఉన్నారు.