బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 నవంబరు 2024 (11:53 IST)

మహారాష్ట్ర సీఎం ఎవరు? మోదీ, అమిత్ షాల ఓటు ఎవరికి?

Devendra Fadnavis
Devendra Fadnavis
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు అనుగుణంగా వస్తున్నాయి. మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ చూస్తే.. పీ మార్క్ ఎన్డీఏ కూటమి 137 నుంచి 157 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. మ్యాట్రిజ్ ఎన్డీఏ కూటమికి 150 నుంచి 170, కాంగ్రెస్ కూటమికి 110 నుంచి 130 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అయితే కేకే సర్వే మాత్రం ఒకటే నంబర్ ఇచ్చింది. 
 
బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 220 స్థానాలను గెలుస్తుందని ప్రకటించింది. ఈ సర్వే తగ్గట్లుగానే మహారాష్ట్ర ఫలితాలు వస్తున్నాయి. ఏపీలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సునామీ తరహాలో విజయం సాధిస్తుందని కేకే సర్వే పేర్కొంది.
 
మరోవైపు మహాయుతి అనూహ్య విజయం దిశగా అడుగులు వేస్తోంది. మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై చర్చ సాగుతోంది. ప్రస్తుత సీఎం షిండే తిరిగి సీఎం గా కొనసాగుతారని శివసేన నేతలు అంచనా వేస్తున్నారు.
 
జేపీ నేతలు మాత్రం తాము కూటమిలో మెజార్టీ స్థానాలు సాధించటంతో తమకే సీఎం పీఠం దక్కుతందని ధీమాగా ఉన్నారు. అయితే, ప్రధాని మోదీ - అమిత్ షా నిర్ణయం కీలకంగా మారనుంది. బీజేపీ నుంచే సీఎం అభ్యర్ధి ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. 
 
అందులో భాగంగా మాజీ సీఎం.. ప్రస్తుత సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు తిరిగి ఛాన్స్ దక్కుతుందని అంచనా వేస్తున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా సైతం ఫడ్నవీస్ పైన సానుకూలంగా ఉన్నారు. దీంతో, మహారాష్ట్ర నూతన సీఎంగా ఫడ్నవీస్ పేరు ఖాయంగా కనిపిస్తోంది.