1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2020 (13:20 IST)

ఆహార పదార్థాలను ఉచితంగా పంపిణీ చేయండి: కేబినెట్ కార్యదర్శి

కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నందున ప్రజలను ఆదుకునేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన ప్యాకేజీని అన్ని రాష్ట్రాల్లో సక్రమంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సిఎస్ లను ఆదేశించారు.
 
 కరోనా వైరస్ పై బుధవారం ఢిల్లీ నుండి ఆయన వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డిజిపిలతో వీడియో సమావేశం సందర్భంగా రాజీవ్ గౌబ మాట్లాడుతూ... లాక్ డౌన్ ను దేశ వ్యాప్తంగా పటిష్టంగా అమలు చేస్తున్నందుకు అన్ని రాష్ట్రాల సిఎస్ లను, డిజిపి లను కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ లను అభినందించారు.

మరో రెండు వారాలు ఇదే విధంగా లాక్ డౌన్ ను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజలకు అన్ని రకాల నిత్యావసర సేవలు, సరుకులు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. లాక్ డౌన్ అమలులో ఏమాత్రం రాజీ పడవద్దని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోను కోవిద్ వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

 లాక్ డౌన్ నేపధ్యంలో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రధాన మంత్రి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని పటిష్టంగా అమలు చేసేందుకు ఆన్ని రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలకు బియ్యం, గోధుమలు, కందిపప్పు తదితర ఆహార పదార్థాలను ఉచితంగా పంపిణీ చేయాలని రాజీవ్ గౌబ చెప్పారు.

దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు ఎటియంలు సక్రమంగా పనిచేస్తున్నాయని తెలిపారు. వెంటనే రాష్ట్ర స్థాయి బ్యాంకులు కమిటీ సమావేశం సమావేశాన్ని నిర్వహించాలని సిఎస్ లకు చెప్పారు. అదే విధంగా జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బ్యాంకరుల సలహా కమిటీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ఆదేశించారు. 
 
ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్ళి వచ్చినవారిలో ఇప్పటికే సుమారు 400 మందిని గుర్తించి వారు కాంటాక్ట్ అయిన వారిని గుర్తించే ప్రక్రియ జరుగుతోందని 1086 మందిని హోం ఐసోలేషన్ లో ఉంచేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించారు.

రాష్ట్రానికి మరిన్ని టెస్టింగ్ కిట్లు అవుసరం ఉందని చెప్పారు. విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించే ప్రక్రియ పూర్తి కావచ్చిందని గ్రామ,వార్డు వాలంటీర్లు ద్వారా ఇంటింటా సర్వే నిర్వహించినట్లు చెప్పారు.

ఆదే విధంగా పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్య వ్యవస్థను అన్నివిధాలా మెరుగు పరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగుతోందని ఇందుకై వార్డుల వారీగా ఎఎన్ఎం,మెడికల్ అధికారి,వార్డు కార్యదర్శి తదితరులుతో కూడిన బృందాలను ఇంటికి సర్వే నిర్వహించడం జరుగుతోందని సిఎస్ నీలం సాహ్ని చెప్పారు. 
 
ఈ వీడియో సమావేశంలో డిజిపి గౌతం సవాంగ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, గిరిజా శంకర్, సుబ్రహ్మణ్యం తదితరులు.