గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2020 (09:45 IST)

అబ్బే... ఆ వార్తల్లో నిజం లేదు.. ఆర్థిక సంవత్సరం పొడిగింపు 'నై నై'

ఆర్థిక సంవత్సరం పొడిగింపు వార్తలు అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. పాత సంప్రదాయమే కొనసాగుతుందని కూడా స్పష్టం చేసింది.

ఏప్రిల్‌ 2019 నుంచీ ప్రారంభమై మార్చి 2020తో ముగిసే 2019–2020 ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలలు అంటే జూన్‌ నెలాంతం వరకూ పొడిగించాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.

అయితే కేంద్రం ఖండించింది. దీని ప్రకారం ఆర్థికశాఖ కింద పనిచేస్తున్న రెవెన్యూ శాఖ 30వ తేదీన ఇండియన్‌ స్టాంప్స్‌ యాక్ట్‌లో కొన్ని సవరణలకు సంబంధించి ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

దీనిని కొన్ని మీడియా వర్గాలు తప్పుగా అర్థం చేసుకున్నాయి. ‘‘స్టాక్‌ ఎక్స్ఛేంజీలు లేదా క్లీనింగ్‌ కార్పొరేషన్‌ల ద్వారా జరిగే సెక్యూరిటీ మార్కెట్‌ ఇన్‌స్ట్రుమెంట్ల లావాదేవీలపై స్టాంప్‌ డ్యూటీ వసూళ్లకు 2020 ఏప్రిల్‌ 1 నుంచీ పటిష్ట యంత్రాంగం అమల్లో ఉంటుందని గత నోటిఫికేషన్‌ ఒకటి తెలిపింది.

అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ యంత్రాగం అమలును 2020 జూలై 1వ తేదీ వరకూ వాయిదా వేయడం జరిగిందని రెవెన్యూ శాఖ మార్చి 30వ తేదీన ఒక ప్రకటన ఇచ్చింది. దీనిని కొన్ని మీడియా వర్గాలు తప్పుగా అర్థం చేసుకున్నాయి’’ అని ఆర్థికశాఖ వివరణ ఇచ్చింది.