గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2020 (12:22 IST)

రంగంలోకి ధోవల్.. మర్కజ్ నిర్వాహకులపై కేసు... క్వారంటైన్ తరలింపు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం ఢిల్లీలో జరిగిన మర్కత్ కార్యక్రమం అని తేలింది. దీంతో ఈ కార్యక్రమం నిర్వాహకులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా మర్కజ్‌లో ఉన్న వారిని క్వారంటైన్‌కు తరలించే విషయంలో మొండికేశారు. దీంతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ రంగంలోకి దిగి, మర్కజ్‌లో ఉన్న వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు. 
 
త‌బ్లిగీ జ‌మాత్ మ‌ర్క‌త్ పేరుతో ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఈ నెల 13 నుంచి 15వ తారీఖు మ‌ధ్య భారీ ప్రార్థ‌న‌లు జ‌రిగాయి. ఈ ప్రార్థనల్లో పలు దేశాల నుంచి ముస్లిం ప్రతినిధులు కూడా హాజరయ్యారు. అలాగే, రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది ముస్లిం పెద్దలు, ప్రతినిధులు పాల్గొన్నారు. వీరిద్వారా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్టు తాజాగా తేలింది. ఒక్క మంగళవారం నమోదైన కేసులన్నీ నిజాముద్దీన్‌కు వెళ్లివచ్చిన వారే కావడం గమనార్హం. 
 
దీంతో నిజాముద్దీన్‌లో కార్యక్రమం నిర్వహించిన వారిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. దాంట్లో ఆరుగురి పేర్ల‌ను చేర్చారు.  వారిలో మౌలానా సాద్‌, డాక్ట‌ర్ జీషాన్‌, ముఫ్తీ షెహ‌జాద్‌, ఎం సాఫి, యూనిస్‌, మ‌హ‌మ్మ‌ద్ స‌ల్మాన్‌లు ఉన్నారు. వీరితోపాటు ఇదే కేసులో మొహ‌మ్మ‌ద్ అష్ర‌ఫ్‌ను కూడా జ‌త‌ప‌రుస్తున్న‌ట్లు పోలీసులు చెప్పారు. ప్ర‌స్తుతం ఈ ప్రాంతాన్ని పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు.  వైద్యారోగ్య‌శాఖ‌కు చెందిన సిబ్బంది మ‌ర్క‌జ్ బిల్డింగ్ ప్రాంతాన్ని శుద్ధీక‌రిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 
 
బుధవారం ఉద‌యం 3.30 నిమిషాల‌కు బిల్డింగ్ నుంచి పూర్తి స్థాయిలో అంద‌ర్నీ క్వారంటైన్‌కు తరలించారు. చెప్పారు. మొత్తం 2100 మంది ఈ బిల్డింగ్‌లో ఉన్నారు. వారంద‌ర్నీ మ‌రో చోటుకు త‌ర‌లించేందుకు అయిదు రోజుల స‌మ‌యం ప‌ట్టింద‌ని ఢిల్లీ పోలీసులు చెప్పారు. మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లి వ‌చ్చిన 40 మందిని కేర‌ళ పోలీసులు గుర్తుప‌ట్టారు. వారిని క్వారెంటైన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు, మర్కజ్ నిర్వాహకులపై కేసు అంటు వ్యాధుల చట్టం 1897 ప్రకారం కేసు నమోదు చేశారు. అలాగే, ఈ మర్కాజ్‌కు హాజరైన 12 మంది విదేశీయుల సమాచారాన్ని దాచిపెట్టిన జామా మసీదు వజీరాబాద్‌ ఇమామ్‌పై కూడా కేసు నమోదుచేసినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవ తెలిపారు.