మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2017 (11:30 IST)

జిందాబాద్ అనలేదు.. వర్ధిల్లాలి అన్నాడు.. విజయ్ కాంత్ చెంప చెళ్లుమనిపించాడు..

గత ఏడాది ఎన్నికల సందర్భంగా కొంతమంది పాత్రికేయుల మీద ఆగ్రహంతో ఊగిపోయిన డీఎండీకె అధినేత విజయ్ కాంత్.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. ఇదే తరహా సీన్ మళ్లీ రిపీట్ అయింది. అయితే ఈసారి డీఎం

గత ఏడాది ఎన్నికల సందర్భంగా కొంతమంది పాత్రికేయుల మీద ఆగ్రహంతో ఊగిపోయిన డీఎండీకె అధినేత విజయ్ కాంత్.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. ఇదే తరహా సీన్ మళ్లీ రిపీట్ అయింది. అయితే ఈసారి డీఎండీకె కార్యకర్త పైనే ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. అంతేకాదు, సదరు అందరిముందు సదరు కార్యకర్త చెంప చెళ్లుమనిపించడంతో అంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇంతకీ ఆ కార్యకర్త చేసిన తప్పిదమేంటంటే.. జిందాబాద్ బదులు వర్ధిల్లాలి అని పలకడమే. జిందాబాద్.. అనకుండా వర్ధిల్లాలి అని పలికిన పాపానికి చెంపచెళ్లుమనిపించారు. 
 
తమిళనాడులోని పెరంబళూరులో శుక్రవారం నాడు డీఎండీకే ఆధ్వర్యంలో నిర్వహించిన 'మీతో నేను' అనే కార్యక్రమంలో విజయ్ కాంత్ ఇలా ప్రవర్తించారు. అప్పటిదాకా కార్యకర్తల సమస్యలకు, ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన విజయ్ కాంత్.. కార్యక్రమం ముగిసిన వెంటనే వేదిక దిగి బయటకు నడవడం మొదలుపెట్టారు. ఇంతలో విజయ్‌కాంత్‌కు ఎదురుపడ్డ ఓ కార్యకర్త 'విజయకాంత్ వర్దిల్లాలి' అంటూ గట్టిగా నినదించాడు. దీంతో తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన విజయ్ కాంత్ కార్యకర్త చెంప చెళ్లుమనిపించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
 
గత ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జయలలిత మళ్లీ గెలుస్తారా? అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నపై విజయ్‌కాంత్ భగ్గుమన్నారు. ఇదే ప్రశ్నను జయలలితను అడిగే దమ్ముందా? అంటూనే థూ అని ఉమ్మేశారు. అంతటితో ఊరుకోకుండా జర్నలిస్టులందరూ పిరికివాళ్లని, తమలాంటి వారి వద్దే ప్రగల్భాలు తప్ప వేరేలేదంటూ రుసరుసమన్నారు. ఇంకా కొంతమంది పాత్రికేయుల మీద ఆగ్రహంతో ఊగిపోయిన విజయ్ కాంత్ వారిని చెంపదెబ్బ కొడుతానంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.