ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 16 డిశెంబరు 2016 (09:05 IST)

డీఎంకే అధినేత కరుణానిధికి తీవ్ర అస్వస్థత.. మరణించారంటూ వదంతులు...

డీఎంకే అధినేత, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, రాజకీయ కురువృద్ధుడు ఎం.కరుణానిధి మరోమారు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. 92 యేళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న కరుణానిధి మరోమారు ఆస్పత్రిలో చేరా

డీఎంకే అధినేత, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, రాజకీయ కురువృద్ధుడు ఎం.కరుణానిధి మరోమారు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. 92 యేళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న కరుణానిధి మరోమారు ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం శ్వాసతీసుకోవడంలో ఆయన తీవ్ర ఇబ్బంది పడుతుండడంతో ఆయనను చెన్నైలోని కావేరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారని వైద్యులు తెలిపారు. 
 
అయితే ఆయన మరణించారంటూ వందతులు వ్యాపించడంతో  కావేరీ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. గొంతు, శ్వాసకోస సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారని, ఆయనకు అత్యుత్తమ వైద్యులతో చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. డీఎంకే శ్రేణులు, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. ఇటీవలే ఆయన కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవలే డిశ్చార్జ్ అయిన విషయం తెల్సిందే.