బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 అక్టోబరు 2024 (10:42 IST)

కడుపులో రెండు కత్తెరలు.. 12 యేళ్ళుగా మహిళ అవస్థలు

cesarean operation
ఒక వైద్యుడు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఓ మహిళ రెండు కత్తెరలతో 12 యేళ్ళుగా అవస్థలు పడుతూ వచ్చింది. ఆపరేషన్‌కు ఉపయోగించే రెండు కత్తెరలు ఉంచి కుట్లు వేసిన 12 ఏళ్ల తర్వాత బయటపడింది. 
 
సిక్కిం రాష్ట్రానికి చెందిన ఓ మహిళ 12 యేళ్ళ క్రితం గ్యాంగ్‌టక్‌లోకి ఓ ఆస్పత్రిలో అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకుంది. అప్పటి నుంచి ఆ మహిళ తరచుగా కడుపునొప్పితో ఇబ్బంది పడుతూ వచ్చింది. చాలా మంది వైద్యులను సంప్రదించినప్పటికీ నొప్పితగ్గలేదు. నొప్పికి కారణం కూడా చెప్పలేకపోయారు. అయితే, ఈ నెల 8వ తేదీన ఆమెకు తనకు గతంలో ఆపరేషన్‌ చేసిన ఆస్పత్రి వెళ్ళి వైద్యులను సంప్రదించగా, వారు అనుమానంతో ఎక్స్‌రే తీయించగా అసలు విషయం బయటపడింది. 
 
ఆమె పొత్తి కడుపులో రెండు సర్జికల్ కత్తెరలు ఉన్నట్టు గుర్తించారు దీంతో వెంటనే ఆ మహిళకు ఆపరేషన్ చేసి రెండు కత్తెరలను తొలగించారు. ఆమె ప్రస్తుతం కోలుకుంటోంందని వైద్యులు వెల్లడించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆస్పత్రి వైద్యులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.